Andhra Pradesh: ఏపీలో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1,438 కోట్లు విడుదల చేసిన కేంద్రం

Central Finance ministry Allocate Grants to Andhrapradesh

  • ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 17 రాష్ట్రాలకు రూ. 9,871 కోట్లు విడుదల
  • ఇప్పటి వరకు ఏపీకి దక్కింది రూ. 4,314.24 కోట్లు
  • 12 విడతల్లో ఏపీకి మొత్తంగా రూ. 17,256.96 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం తాజాగా రూ. 1,438 కోట్లను విడుదల చేసింది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 17 రాష్ట్రాలకు మొత్తం రూ. 9,871 కోట్లను మూడో విడత రెవెన్యూలోటు భర్తీ కింద విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు దక్కాయి. వీటితో కలుపుకుని రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ. 4,314.24 కోట్లు అందాయి.

 కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 17 రాష్ట్రాలకు కలిపి రూ. 1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ. 17,256.96 కోట్లు రానున్నాయి.

  • Loading...

More Telugu News