Vishwak Sen: మరో ప్రాజెక్టును లైన్లో పెడుతున్న విష్వక్సేన్!

Vishwak Sen next movie with Nakkina Trinatha Rao
  • మాస్ ఆడియన్స్ లో క్రేజ్
  • విడుదలకు రెడీగా ఉన్న 'పాగల్ '
  • నెక్స్ట్ మూవీ త్రినాథరావుతో
విష్వక్సేన్ మొదటి నుంచి కూడా మాస్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. 'ఈ నగరానికి ఏమైంది?' .. 'ఫలక్ నుమా దాస్' సినిమాలు ఆయన మాస్ ఇమేజ్ ను పెంచాయి. ఆ తరువాత చేసిన 'హిట్' సినిమా కూడా ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆయన తాజా చిత్రం 'పాగల్' విడుదలకి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలోనే ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఆయనతో ఓకే అనిపించుకున్న ఆ దర్శకుడు నక్కిన త్రినాథరావు అని తెలుస్తోంది. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను మెప్పించే కథలను తెరకెక్కించడంలో నక్కిన త్రినాథరావు సిద్ధహస్తుడు. 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' సినిమాలు అందుకు నిదర్శనం.

ఇటీవలే ఆయన వరుణ్ తేజ్ కి ఒక కథను చెప్పి ఒప్పించాడనే టాక్ వచ్చింది. తాజాగా విష్వక్ సేన్ కి కూడా ఓ కథను చెప్పి ఆ ప్రాజెక్టును సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నక్కిన త్రినాథరావుకి మాస్ పల్స్ తెలుసు. ఇక విష్వక్ కి మాస్ ఇమేజ్ ఉంది. అందువలన ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.
Vishwak Sen
Paagal Movie
Nakkina Trinatha Rao

More Telugu News