corona vaccine: కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వితో పోలిస్తే కొవాగ్జిన్‌ ధర ఎందుకు ఎక్కువ?

why covaxin is costlier than covishield and sputnik v

  • కొవిషీల్డ్‌ డోసు రూ.780
  • స్పుత్నిక్‌-వి డోసు రూ.1,145
  • కొవాగ్జిన్‌ ఒక్కో డోసు రూ.1,410
  • కొవాగ్జిన్‌ తయారీ సాంకేతికత సంక్లిష్టం 
  • ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో టీకా తయారీ సులభం

కొవిషీల్డ్‌ ఒక్కో డోసు ధర రూ.780. స్పుత్నిక్‌-వి ధర డోసుకు రూ.1,145. కానీ, దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్‌ ధర మాత్రం రూ.1,410. కొవిషీల్డ్‌తో పోలిస్తే దీని ధర దాదాపు రెండింతలు. కొవాగ్జిన్‌ ధర దాదాపు ఫైజర్‌ కొవిడ్‌ టీకాతో సమానం. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కొవిడ్‌ టీకాల్లో అత్యధిక ధర పలుకుతున్న మూడో టీకా కొవాగ్జిన్‌. మరి దీనికి ఇంత ధర ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ అంశంపై పలువురు నిపుణులు స్పందించారు. కొవాగ్జిన్‌ టీకా తయారీకి ఉపయోగించే సాంకేతికతే అధిక ధరకు కారణమని చెబుతున్నారు. ‘‘కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి టీకాలతో పోలిస్తే కొవాగ్జిన్‌ తయారీ విధానం పూర్తిగా భిన్నం. ఇందులో అచేతన వైరస్‌ను ఉపయోగిస్తున్నారు. దీని కోసం వందల లీటర్ల సీరంను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్‌ఎల్‌ ల్యాబ్‌లో వైరస్‌ను అత్యంత జాగ్రత్తగా సీరంలో వృద్ధి చేయాల్సి ఉంటుంది. తిరిగి దాన్ని అచేతన స్థితికి తీసుకెళ్లాలి’’ అని ‘సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ’ సలహాదారు రాకేశ్‌ మిశ్రా వివరించారు.

ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో తయారు చేసిన కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ల తయారీలో మాత్రం ఇంత పెద్ద ప్రక్రియ ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొవాగ్జిన్‌తో పోలిస్తే వీటిని సులభంగా తయారు చేయొచ్చని తెలిపారు. జీవించి ఉన్న వైరస్‌ను వీటిలో ఉపయోగించరని పేర్కొన్నారు. కేవలం కరోనా వైరస్‌లో ఉండే స్పైక్‌ ప్రోటీన్‌ను శ‌రీరంలోని క‌ణాల‌కు హాని లేని రీతిలో తయారు చేసేలా వీటిని రూపొందిస్తారని పేర్కొన్నారు. వీటి తయారీకి భారీ వసతులు కూడా అవసరం లేదని పేర్కొన్నారు. అందువల్లే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే కొవాగ్జిన్‌ టీకా ధర అధికంగా ఉందని వివరించారు.

  • Loading...

More Telugu News