Nigeria: భారత్‌కు చెందిన సామాజిక మాధ్యమం ‘కూ’లో ఖాతా తెరిచిన నైజీరియా ప్రభుత్వం

Nigeria opened account in Indian Koo after banning twitter

  • నైజీరియా అధ్యక్షుడి ట్వీట్‌ తొలగించిన ట్విట్టర్‌
  • ఆగ్రహంతో ట్విట్టర్‌పై అక్కడి ప్రభుత్వం నిషేధం
  • ప్రత్యామ్నాయంగా ‘కూ’ని వాడుతున్న ప్రభుత్వం
  • స్వాగతం పలికిన ‘కూ’ సీఈఓ అప్రమేయ

ట్విట్టర్‌ను నిషేధించిన నైజీరియా ప్రభుత్వం భారత్‌కు చెందిన సామాజిక మాధ్యమం ‘కూ’లో ఖాతా తెరిచింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల వివరాలను తెలియజేసేందుకు ‘కూ’ని వినియోగించుకుంటోంది. గురువారం జరగబోయే ఓ రైల్వేలైన్ ప్రారంభ కార్యక్రమానికి నోబెల్‌ పురస్కార గ్రహీత వోల్‌ సోయింకా వస్తున్నట్లు నైజీరియా ప్రభుత్వం ‘కూ’ వేదికగా వెల్లడించింది.

ఈ విషయాన్ని ‘కూ’ సీఈఓ అప్రమేయ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నైజీరియా ప్రభుత్వానికి ‘కూ’లోకి స్వాగతం పలికారు. తమ సామాజిక మాధ్యమం భారత్‌ వెలుపలకూ పాకుతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

నైజీరియా అధ్యక్షుడు చేసిన కొన్ని ట్వీట్లను ట్విట్టర్‌  తొలగించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కడి ప్రభుత్వం ట్విట్టర్‌ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా మారిన ‘కూ’లో ఖాతా తెరిచింది.

  • Loading...

More Telugu News