Europe Countries: డెల్టా వేరియంట్‌తో జాగ్రత్త.. ఐరోపా దేశాలను హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO Warns Europe Countries About Delta Variant

  • కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలు సడలిస్తున్న ఐరోపా దేశాలు
  • తొందరపాటు వద్దని హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ
  • నిర్లక్ష్యంగా ఉంటే డెల్టా వేరియంట్ రెచ్చిపోతుందని హెచ్చరిక

కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు సడలిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా దేశాలకు హెచ్చరికలు చేసింది. భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండకపోతే డెల్టా వేరియంట్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ వేరియంట్‌ కొన్ని వ్యాక్సిన్లను తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉందని, మరీ ముఖ్యంగా ఈ వేరియంట్ వల్ల 60 ఏళ్లు దాటిన వారికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, సామూహిక సమావేశాలు, ప్రయాణాలకు అనుమతుల విషయంలో జాగురూకత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా డైరెక్టర్ హన్స్‌క్లూగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News