Mehul Choksi: చోక్సీ బెయిలు పిటిషన్‌ను తిరస్కరించిన డొమినికా హైకోర్టు
- గత నెల 25న అంటిగ్వా నుంచి చోక్సీ పరార్
- అనారోగ్య కారణాలతో బెయిలు ఇవ్వాలన్న న్యాయవాదులు
- ఇవ్వలేమని తేల్చి చెప్పిన న్యాయస్థానం
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను డొమినికా హైకోర్టు తిరస్కరించింది. భారత్ నుంచి పరారైన తర్వాత అంటిగ్వాలో ఉంటూ వచ్చిన మెహుల్ చోక్సీ గత నెల 25న అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత డొమినికాలో ఇంటర్‌పోల్‌కు చిక్కాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్న చోక్సీ బెయిలు కావాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
చోక్సీ మరెక్కడికీ పారిపోరని, అనారోగ్య కారణాలతో బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, ‘ఫ్లైట్ రిస్క్’ (విచారణకు ముందే దేశం విడిచి వెళ్లిపోవడం) కారణంగా బెయిలు ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. డొమినికాలో చోక్సీ ఉంటున్నది స్థిరమైన చిరునామా కాదని, ఆయనపై నమోదైన ఆరోపణలపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని గుర్తు చేసింది.