Biophore: హైదరాబాద్కు చెందిన బయోఫోర్ నుంచి కరోనాకు మరో ఔషధం.. డీజీసీఐకి దరఖాస్తు
- అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ
- క్లినికల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
- కరోనా బాధితులు త్వరగా కోలుకుంటారన్న బయోఫోర్
హైదరాబాద్కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ నుంచి కరోనాకు కొత్త ఔషధం రాబోతోంది. కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు ఈ సంస్థ అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఔషధ వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.
తాము అభివృద్ధి చేసిన వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ పెప్డైడ్ (వీఐపీ) అయిన అవిప్టాడిల్తో కరోనా బాధితులు త్వరగా కోలుకుంటారని బయోఫోర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని సంస్థ సీఈవో డాక్టర్ జగదీశ్ బాబు తెలిపారు. ఇదే కంపెనీ గతంలో ఫావిపిరావిర్ ఔషధాన్ని తీసుకొచ్చింది.