Rahul Ravindran: గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్!

Rahul Ravindran in Geetha Arts 2 Banner
  • 'చి..ల..సౌ' సినిమాతో హిట్
  • 'మన్మథుడు 2'తో భారీ ఫ్లాప్
  • గీతా ఆర్ట్స్ 2 పై లవ్ స్టోరీ
  • త్వరలో సెట్స్ పైకి    
రాహుల్ రవీంద్రన్ 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆ స్థాయి పాత్రలు ఆయనకి లభించలేదు. దాంతో తనకి నచ్చిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. మొదటి నుంచి దర్శకత్వం పట్ల కూడా ఆసక్తి ఉండటంతో మెగాఫోన్ పట్టేశాడు. అలా ఆయన తెరకెక్కించిన 'చి..ల..సౌ' సినిమాకి మంచి ఆదరణ లభించింది. నటుడిగానే కాదు దర్శకుడిగాను వరుస సినిమాలు చేయవచ్చని అంతా అనుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ఆ తరువాత సినిమాగా 'మన్మథుడు 2'ను రూపొందించాడు.

నాగార్జున కథనాయకుడిగా రాహుల్ తెరకెక్కించిన 'మన్మథుడు 2' పరాజయం పాలైంది. ఆ తరువాత రాహుల్ మరో మంచికథను తయారుచేసుకుని రంగంలోకి దిగాడు. గీతా ఆర్ట్స్ 2 వారికి ఆయన ఆ కథను వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా గీతా ఆర్ట్స్ 2 వారు ఆయన కథను ఓకే చేశారట. దాంతో సెట్స్ పైకి వెళ్లడానికి రాహుల్ సన్నాహాలు చేసుకుంటున్నాడని, ఇది ఒక అందమైన ప్రేమకథ అని అంటున్నారు. ఓ మాదిరి బడ్జెట్ తో ఇది రూపొందనుంది. మరి ఈ లవ్ స్టోరీలో నాయకానాయికలు ఎవరో .. ఈ కథతో రాహుల్ ఎంతవరకూ యూత్ ను మెప్పిస్తాడో చూడాలి.
Rahul Ravindran
Nagarjuna
Manmathudu 2 Movie

More Telugu News