England: డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. యూకేలో లాక్‌డౌన్ ఎత్తివేత నాలుగు వారాల ఆలస్యం!

UK considers up to 4 week delay to end of lockdown due to Delta variant
  • బి.1.617.2 రకమే డెల్టా వేరియంట్‌
  • ఇంగ్లండ్‌లో వారంలో 30 వేలు పెరిగిన కేసులు
  • లాక్‌డౌన్ ఎత్తివేత ఆలోచనను విరమించుకున్న జాన్సన్ ప్రభుత్వం
భారత్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇంగ్లండ్ లాక్‌డౌన్ ఎత్తివేతను నాలుగు వారాలు ఆలస్యం చేసింది. నిజానికి ఈ నెల 21తో యూకేలో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో ఆంక్షలు ఎత్తివేయాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పుడు డెల్టా వేరియంట్ రూపంలో వచ్చిన కొత్త సమస్య లాక్‌డౌన్‌ను మరో నెల రోజులపాటు పొడిగించేలా చేసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో డెల్టా వేరియంట్ కేసులు 30 వేలు పెరిగి 42,323కు చేరుకున్నాయి.

కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తుండడంతో లాక్‌డౌన్ ఎత్తివేతపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి లాక్‌డౌన్ ఎత్తివేత ఆలోచనను విరమించుకున్న ప్రభుత్వం.. మరో నాలుగు వారాలపాటు ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరోవైపు, యూకేలో కరోనా కేసులు కూడా పెద్ద ఎత్తున వెలుచూస్తున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 8,125 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, భారత్‌లో వెలుగుచూసిన బి.1.617.2 వేరియంట్‌నే డెల్టా వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరంగా వ్యాపిస్తున్నట్టు పలు పరిశోధనలు వెల్లడించాయి.
England
UK
Delta Variant
Lockdown

More Telugu News