USA: ఎల్జీబీటీల ర్యాలీలో గళమెత్తిన కమలా హ్యారిస్​

Kamala Harris Takes Part in LGBTQ Rally

  • హ్యాపీ ప్రైడ్ అంటూ నినాదం
  • కొద్ది దూరం పాటు పాదయాత్ర
  • ఎల్జీబీటీల హక్కులు కాపాడుతామని హామీ

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఎల్జీబీటీక్యూలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పాల్గొన్నారు. ఎల్జీబీటీలకు అభివాదం చేస్తూ ‘హ్యాపీ ప్రైడ్’ అంటూ నినదించారు. కొద్ది దూరం పాటు వారితో కలిసి పాదయాత్ర తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమానత్వ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఎల్జీబీటీక్యూల హక్కులను కాపాడేందుకు బైడెన్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు.

ఎప్పటి నుంచో ఎల్జీబీటీక్యూల హక్కులపై వాదనలు చేస్తున్న ఆమె.. ఇంకా దానికోసం చేయాల్సినది ఎంతో ఉందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎల్జీబీటీక్యూల హక్కులు, సమానత్వం, వారికి గుర్తింపు, విద్య, వైద్యం వంటివి కల్పించడంతో పాటు అందరిలాగే తమపైనా ప్రేమ చూపించాలని కోరుతూ జూన్ లో ‘హ్యాపీ ప్రైడ్’ ఉత్సవాలు నిర్వహిస్తారు.


పేరులో హ్యాపీ ఉన్నా.. వాస్తవానికి అదో విషాద ఘటన. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎల్జీబీటీలపై నిషేధం ఉంది. న్యూయార్క్ పోలీసులు ఎప్పుడూ ఎల్జీబీటీ బార్లపై దాడులు చేసేవారు. 1969 జూన్ 28న కూడా గ్రీన్ విచ్ గ్రామంలో ఉన్న స్టోన్ వాల్ అనే గే బార్ పై పోలీసులు రైడ్స్ చేశారు. కానీ, ఈసారి పోలీసులపై వారు తిరగబడ్డారు. కొన్ని రోజుల పాటు ఆందోళనలు సాగాయి. ఆ ఘటన జరిగిన ఏడాదికి ఆ అల్లర్లను గుర్తు చేసుకుంటూ వార్షికోత్సవం నిర్వహించారు. భారీ ప్రైడ్ పరేడ్ నిర్వహించారు. అప్పట్నుంచి ఏటా ఇలా పరేడ్లు జరుగుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News