Rythubandhu: తెలంగాణలో ఈ నెల 15 నుంచి రైతుబంధు నిధుల విడుదల

Rythubandhu funds will be released in Tealangana
  • అర్హుల జాబితా రూపొందించిన సీసీఎల్ఏ
  • వ్యవసాయశాఖకు జాబితా అందజేత
  • నిధుల విడుదలకు సన్నాహాలు
  • 63.25 లక్షల మంది రైతులకు లబ్ది
రైతుబంధు పథకంలో భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 15 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నారు. రైతుబంధు అర్హులపై తుది జాబితా రూపొందించిన సీసీఎల్ఏ, ఆ జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది. రైతుబంధుకు 63.25 లక్షల మంది అర్హులని ఆ జాబితాలో పేర్కొన్నారు. రైతుబంధుకు గతంలో కంటే ఈసారి 2.81 లక్షల మంది రైతులు పెరిగారు.

కాగా, బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, ఈసారి రైతుబంధు లబ్దిదారుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు ఉన్నారు.
Rythubandhu
Funds
Telangana
Farmers

More Telugu News