E-Pass: ఈ-పాస్ లేకుండా ఏపీ నుంచి వస్తున్న వాహనాలను నిలిపివేస్తున్న తెలంగాణ పోలీసులు

Telangana police does not allow vehicles without epass

  • ఆదివారం మరింత పెరిగిన ట్రాఫిక్
  • రామాపురం చెక్ పోస్టు వద్ద భారీగా వాహనాల నిలిపివేత
  • ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి
  • ఈ-పాస్ ఉండాల్సిందేనన్న తెలంగాణ పోలీసులు

ఏపీ నుంచి వచ్చే వాహనాల పట్ల తెలంగాణ పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఈ-పాస్ లు లేని వాహనాలను అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద నిలిపివేస్తున్నారు. ఆదివారం కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకల తాకిడి పెరిగింది. అయితే, కోదాడ వద్ద తెలంగాణ పోలీసులు భారీగా వాహనాలను నిలిపివేశారు. ఈ-పాస్ లేకుండా ఏపీ నుంచి వచ్చిన వాహనాలను వెనక్కి పంపించి వేస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

దీనిపై కోదాడ ఎస్ఐ సైదులు స్పందిస్తూ, ప్రజలు తెలంగాణ పోలీసులకు సహకరించాలని, ప్రయాణాలు చేసేవారు ఈ-పాస్ లతో రావాలని స్పష్టం చేశారు. కాగా, రామాపురం చెక్ పోస్టు వద్ద ఈ మధ్యాహ్నం భారీగా వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు కనిపించాయి. ఎంతసేపు వేచిచూసినా అనుమతించకపోవడంతో చాలామంది వాహనదారులు నిరాశగా వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News