G-T Summit: సైబర్‌స్పేస్‌ను ప్రజాస్వామ్య విలువల్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగించాలి: మోదీ

Cyber space should not be used to advance the democracy

  • జీ-7 సమావేశంలో ప్రసంగించిన ప్రధాని
  • ప్రజాస్వామ్య దేశాలు సైబర్‌ నేరాలకు గురవుతున్నాయని ఆందోళన
  • వాతావరణ మార్పులపై సమష్టి చర్యలకు పిలుపు
  • పారిస్‌ ఒప్పందాల అమలుకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం

జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో భాగంగా రెండో రోజు జరిగిన రెండు కీలక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘బిల్డింగ్‌ బ్యాక్‌ టుగెదర్‌-ఓపెన్‌ సొసైటీస్‌ అండ్‌ ఎకానమీస్‌’ ఇతివృత్తంతో జరిగిన సమావేశంలో మోదీ లీడ్‌ స్పీకర్‌ హోదాలో ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ భారత నాగరికతలోనే ఇమిడి ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఓపెన్ సొసైటీలు నిత్యం అవాస్తవ సమాచారం, సైబర్‌ నేరాల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని మోదీ నొక్కి చెప్పారు. సైబర్‌స్పేస్‌ను ప్రజాస్వామ్య విలువల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించాలని.. వాటిని పక్కదారి పట్టించేందుకు కాదని హితవు పలికారు.

వాతావరణ మార్పులపై జరిగిన మరో సమావేశంలో మోదీ మాట్లాడుతూ..  భూ వాతావరణం, జీవవైవిధ్యం, మహాసముద్రాలను.. గోతులు తవ్వే దేశాలు రక్షించలేవని వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై సమష్టిగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల విషయంలో చర్యలపై భారత్‌ చూపుతున్న నిబద్ధతను నొక్కి చెప్పిన ఆయన, 2030 నాటికి జీరో ఉద్గారాలను సాధించడానికి రైల్వేశాఖ చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను సాధించే దిశగా జీ-20 దేశాల్లో భారత్‌ మాత్రమే ముందుకు వెళుతోందని తెలిపారు.

ఆరోగ్యం, వాతావరణ మార్పు, ఆర్థిక పునరుత్తేజం వంటి సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం, ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధాని సందేశాన్ని సభ్య దేశాలు సాదరంగా స్వాగతించాయి.

  • Loading...

More Telugu News