Twitter: ప్రత్యేక అధికారిని నియమించినట్టు కేంద్రానికి తెలిపిన ట్విట్టర్

Twitter appointed interim compliance officer

  • కేంద్రం, ట్విట్టర్ మధ్య నిబంధనల యుద్ధం
  • కొత్త ఐటీ రూల్స్ తెచ్చిన కేంద్రం
  • తాత్సారం చేస్తున్న ట్విట్టర్
  • ఇప్పటికే పలు హెచ్చరికలు చేసిన కేంద్రం
  • నేడు కూడా ఆఖరి చాన్స్ అంటూ నోటీసులు

కొత్త ఐటీ నిబంధనలను ట్విట్టర్ ఇంకా అమలు చేయకపోవడంపై ఆగ్రహంతో ఉన్న కేంద్రం మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ ను నియమించినట్టు ట్విట్టర్ కేంద్రానికి తెలిపింది. ఆ అధికారికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కేంద్రంతో నేరుగా పంచుకుంటామని వెల్లడించింది.

అంతకుముందు, కేంద్రం ఇదే ఆఖరి అవకాశం అంటూ ట్విట్టర్ కు తాజాగా నోటీసులు పంపింది. తమ నూతన ఐటీ నియమావళిని అంగీకరిస్తున్నట్టు సమ్మతి తెలిపేందుకు తుది అవకాశం ఇస్తున్నామని కేంద్రం పేర్కొంది. ఒకవేళ తమ నిబంధనలకు అంగీకరించకపోతే, ఉల్లంఘనలపై మినహాయింపులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News