AP High Court: గ్రూప్-1 ఇంటర్వ్యూలను 4 వారాల పాటు నిలిపివేయండి: ఏపీ హైకోర్టు ఆదేశాలు

AP High Court stays Group one interviews for four weeks

  • హైకోర్టుకు చేరిన గ్రూప్-1 వ్యవహారం
  • డిజిటల్ మూల్యాంకనంపై విమర్శలు
  • కోర్టులో 8 పిటిషన్లు దాఖలు
  • విచారణ చేపట్టిన న్యాయస్థానం

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, డిజిటల్ మూల్యాంకనంపై దాఖలైన 8 పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం గ్రూప్-1 మెయిన్స్ ఇంటర్వ్యూలను 4 వారాల పాటు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశిస్తూ స్టే ఇచ్చింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు...
  • గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదు.
  • డిజిటల్ మూల్యాంకనం గురించి చివరి దశలో తెలిపారు.
  • తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్లను రాష్ట్రంలో మూల్యాంకనం చేశారు.
  • ఇంగ్లీషు మీడియం అభ్యర్థుల జవాబు పత్రాలను ఇతర రాష్ట్రాల్లో మూల్యాంకనం చేశారు.
  • ఇంగ్లీషు మీడియంలో రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగింది.
  • ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం ఎలా చేయిస్తారు?
  • ఏపీపీఎస్సీ చైర్మన్ ను పక్కనబెట్టి కార్యదర్శి ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం తరఫు వాదనలు...
  • గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అన్ని నిబంధనలు పాటించాం.
  • మూల్యాంకనం గురించి ముందుగా చెప్పాల్సిన పనిలేదు.
వాదనలు విన్న అనంతరం హైకోర్టు స్పందిస్తూ... తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు వెల్లడించింది. గ్రూప్-1 ఇంటర్వ్యూలపై 4 వారాల పాటు స్టే విధిస్తున్నట్టు తెలిపింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. వాస్తవానికి జూన్ 17 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇంటర్వ్యూలు వాయిదా వేసినట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది. న్యాయ ప్రక్రియ అనంతరం ఇంటర్వ్యూలకు కొత్త తేదీలు వెల్లడిస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News