Raghu Rama Krishna Raju: సాక్షి మీడియాకు లీగల్ నోటీసు పంపిన రఘురామకృష్ణరాజు
- తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచురించారంటూ నోటీసు
- 15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్న రాజు
- లేకపోతే రూ. 50 కోట్ల పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
సాక్షి మీడియాకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచురించారంటూ నోటీసులో పేర్కొన్నారు. తన నోటీసుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని... లేకపోతే రూ. 50 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా కథనాలను ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ వైయస్ భారతి, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులతో పాటు పాలకవర్గం డైరెక్టర్ల పేరుతో నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులపై సాక్షి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.