Adimulapu Suresh: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష... పరీక్షల తేదీపై చర్చించలేదన్న మంత్రి ఆదిమూలపు

Minister Adimulapu Suresh responds on Exams

  • ఏపీలో కరోనా వ్యాప్తి
  • పరీక్షలపై కొనసాగుతున్న అనిశ్చితి
  • జులైలో జరిపేందుకు ప్రభుత్వం ఆలోచన
  • సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి

రాష్ట్ర విద్యాశాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఏం చర్చించారన్నదానిపై మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు.

ఇక సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం తమ దృష్టికి రాలేదని మంత్రి తెలిపారు. నోటీసులు వచ్చాక వాటిని పరిశీలించి చర్చిస్తామని తెలిపారు. పరీక్షలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని, పరీక్షల నిర్వహణపై మొదటి నుంచి తమ వైఖరి ఒక్కటేనని మంత్రి స్పష్టం చేశారు.

కాగా, జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, చివరి వారంలో పదో తరగతి పరీక్షలు జరపాలని ఏపీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో పరీక్షల నిర్వహణపై సర్కారు ఆశాభావంతో ఉంది.

  • Loading...

More Telugu News