Sensex: ఫెడరల్ రిజర్వ్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • వడ్డీ రేట్ల పెంపు దిశగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు
  • 178 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 3 శాతం వరకు నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందంటూ అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ సంకేతాలను ఇవ్వడంతో గ్లోబల్ మార్కెట్లన్నీ నెగెటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178 పాయింట్లు పతనమై 52,323కి పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 15,691కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.86%), ఏసియన్ పెయింట్స్ (1.37%), టీసీఎస్ (1.34%), ఇన్ఫోసిస్ (1.13%), టెక్ మహీంద్రా (1.04%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.91%), ఎన్టీపీసీ (-2.13%), మారుతి సుజుకి (-2.02%), యాక్సిస్ బ్యాంక్ (-1.73%), బజాజ్ ఆటో (-1.52%).

  • Loading...

More Telugu News