Telangana: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత.. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

Lockdown lifted in Telangana
  • కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం
  • వైద్య శాఖ నివేదిక ఆధారంగా నిర్ణయం
  • ఈ రోజు నుంచే అన్ లాక్ అమలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిందంటూ వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ రోజు నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీంతో, అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. అయితే అంతరాష్ట్ర బస్ సర్వీసులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మే 12న తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

Telangana
Lockdown
Unlock

More Telugu News