Parmosia: ఆహారం కంపుకొడుతున్నట్టు అనిపిస్తోందా?.. అయితే మీకు కొవిడ్ అనంతర పార్మోసియా కావొచ్చు!

Parosmia after beating Corona

  • కొవిడ్ అనంతరం బాధితుల్లో వింత సమస్యలు
  • ఆహారం కంపుకొట్టినట్టు అనిపించడం అందులో ఒకటి
  • వృద్ధులు, పొగతాగే వారిలో ఈ సమస్య అధికం

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఏ ఆహారం ముట్టుకున్నా కంపుకొడుతున్నట్టు అనిపిస్తోందా? అయితే మీరు పార్మోసియా బారినపడ్డారని అర్థమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామంది బాధితులు రుచి, వాసనను కోల్పోవడంతోపాటు కొన్ని వింత సమస్యలను ఎదుర్కొంటున్నారని, అలాంటి వాటిలో ఆహారం కంపు కొట్టినట్టు అనిపించడం కూడా ఒకటని అంటున్నారు.

జలుబు, లేదంటే వైరస్ కూడా పార్మోసియాకు ఓ కారణమని వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)కి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ అజయ్ నాథ్ మిశ్రా పేర్కొన్నారు. దీని బారినపడినవారిలో ఘ్రాణ శక్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. శ్వాస ఎగువ భాగంలో వైరస్ సంక్రమణ కారణంగా ఘ్రాణ న్యూరాన్లు దెబ్బతింటాయని వివరించారు. వృద్ధుల్లోను, పొగతాగే వారిలోను ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, బాధితులు క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడతారని ప్రొఫెసర్ అజయ్‌నాథ్ మిశ్రా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News