Ram Gopal Varma: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంపై వర్మ సెటైర్!
- తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత
- పూర్తిస్థాయిలో ప్రజా కార్యకలాపాలకు అనుమతి
- లాక్ డౌన్ ఎత్తివేత ఎవరి కోసమో వేచిచూడాలన్న వర్మ
- వైరస్ కోసమా, ప్రజల కోసమా అంటూ వ్యంగ్యం
తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేసి పూర్తిస్థాయిలో ప్రజా కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిందన్న ఆరోగ్య శాఖ నివేదిక నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆసక్తికరంగా స్పందించారు. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంపై వేచి చూడాల్సి ఉందని, ఆంక్షలు ఎత్తివేసింది వైరస్ కోసమా, లేక ప్రజల కోసమా అనేది త్వరలోనే తెలుస్తుందని సెటైర్ వేశారు.
అంతకుముందు తాను చేసిన కొన్ని ట్వీట్లలో వర్మ విమర్శనాత్మకంగా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్ డౌన్ ఎత్తివేస్తున్నామని, ఆకలి చావులను నివారించడానికే ఆంక్షలు తొలగిస్తున్నామని ప్రభుత్వం ప్రజలకు గట్టిగా చెప్పాలని ఆకాంక్షించారు. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కొవిడ్ ముగిసినట్టు కాదని వర్మ స్పష్టం చేశారు.