Pragya Jaiswal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Pragya Jaiswal in a special song for F Three
  • రొమాంటిక్ కామెడీ పాత్రలో ఆదా శర్మ  
  • 'ఆరడుగుల బుల్లెట్' త్వరలో వస్తోంది
  • 'ఎఫ్ 3'లో ప్రగ్య జైస్వాల్ స్పెషల్ సాంగ్
*  నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న 'మీట్ క్యూట్' సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో ఒకరిగా తాజాగా ఆదా శర్మ ఎంపికైంది. ఇంతవరకు చేయని రొమాంటిక్ కామెడీ పాత్రను తొలిసారిగా ఈ చిత్రంలో చేస్తున్నానని ఆదా శర్మ చెప్పింది. ఇందులో కాజల్ కూడా ఒక హీరోయిన్ గా నటించనుంది.
*  గోపీచంద్, నయనతార జంటగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో ఆరేళ్ల క్రితం నిర్మాణం జరుపుకున్న 'ఆరడుగుల బుల్లెట్' చిత్రం ఆర్థికపరమైన కారణాల వల్ల ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు సమస్యలు పరిష్కారం కావడంతో త్వరలోనే థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 3' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును త్వరలో ప్రారంభించనున్నారు. ఇక ఇందులో ఓ ప్రత్యేకమైన పాట కోసం కథానాయిక ప్రగ్య జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Pragya Jaiswal
Venkatesh
Gopichand
Nayanatara

More Telugu News