Raghu Rama Krishna Raju: శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ.. జగన్‌కు రఘురామకృష్ణరాజు లేఖ!
- మెజార్టీ ఉన్న సమయంలో మండలిని రద్దు చేస్తే మంచిది
- వైసీపీ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు
- మెజార్టీ లేనప్పుడు మండలి రద్దు కోసం తీర్మానం చేశారు
- దాంతో ప్రజల్లో సందేహాలు తలెత్తాయి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఆయన వరుసగా కొన్ని రోజుల నుంచి జగన్‌కు లేఖలు రాస్తోన్న విషయం తెలిసిందే. ఈ సారి శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ లేఖ రాయడం గమనార్హం.
మెజార్టీ ఉన్న సమయంలో మండలిని రద్దు చేస్తే వైసీపీ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని ఆయన తెలిపారు. కొన్ని నెలల క్రితం వైసీపీకి మెజార్టీ లేనప్పుడు శాసన మండలి రద్దు కోసం తీర్మానం చేయడంతో ఈ విషయంపై ప్రజల్లో సందేహాలు తలెత్తాయని ఆయన అన్నారు.
ఇప్పుడు రద్దు చేస్తే మాత్రం ప్రజల్లో జగన్‌కు ఉన్న గౌరవం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. గతంలో మండలిని కొనసాగించడం వృథా అని జగన్ అన్నారని, మండలి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రజలు నమ్మాలంటే వెంటనే దానిని రద్దు చేయాలని కోరారు. మండలి రద్దుకు పార్లమెంట్‌లో తాను కూడా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.