USA: ఉత్తరకొరియా నియంత కిమ్ వ్యాఖ్య‌ల‌పై అమెరికా స్పంద‌న‌!

us on kim behaviour

  • అమెరికాతో చర్చలకైనా, యుద్ధానికైనా సిద్ధమ‌న్న‌ కిమ్  
  • ఆ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయన్న అమెరికా
  • చ‌ర్చ‌ల విష‌యంలో బలమైన వేదిక కోసం సంకేతాలు రావాలని వ్యాఖ్య‌
  • కొరియన్‌ ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా చేసేందుకు సిద్ధ‌మన్న యూఎస్

అమెరికాతో చర్చలకైనా, యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ త‌మ దేశ సైన్యానికి సూచ‌న‌లు చేశారు. జో బైడెన్ ప్రభుత్వం దౌత్య సంబంధాలను పున‌రుద్ధ‌రించాల‌ని భావించ‌గా అందుకు మొద‌ట‌ కిమ్‌ సర్కారు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మాత్రం చ‌ర్చ‌లు అనే ప‌దాన్ని వాడారు.

దీనిపై అమెరికా స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కిమ్ తీరుపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలైవాన్ మాట్లాడుతూ... ఆయ‌న చేసిన‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని, అయితే, చ‌ర్చ‌ల విష‌యంలో బలమైన వేదిక కోసం మరింత స్పష్టమైన సంకేతాలు వచ్చే వరకు వేచిచూస్తామ‌ని తెలిపారు. ఉత్త‌ర‌కొరియాతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందని అధ్య‌క్షుడు జో బైడెన్‌ కార్యవర్గం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింద‌ని చెప్పారు. కొరియన్‌ ద్వీపకల్పాన్ని పూర్తిగా అణ్వాయుధ రహితంగా చేసేందుకు అమెరికా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందని వివ‌రించారు.

  • Loading...

More Telugu News