Sharad Pawar: ప్రశాంత్ కిశోర్ తో మరోసారి భేటీ అయిన శరద్ పవార్

Sharad Pawar met Prashant Kishore in Delhi

  • వారం వ్యవధిలో రెండుసార్లు సమావేశం
  • తొలుత ముంబయిలో మూడు గంటల పాటు భేటీ
  • ఇవాళ ఢిల్లీలో అరగంట పాటు చర్చ
  • 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ పై చర్చ

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సమావేశమయ్యారు. వారం రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా ఈ భేటీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తొలుత జూన్ 11న ముంబయిలో శరద్ పవార్ నివాసంలో దాదాపు 3 గంటల పాటు సమావేశం జరగ్గా, తాజాగా ఢిల్లీలో అరగంట పాటు భేటీ అయ్యారు.

ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయపార్టీలు లేని థర్డ్ ఫ్రంట్ కు రూపకల్పన చేయడంపై వీరిద్దరూ చర్చించినట్టు సన్నిహిత వర్గాలంటున్నాయి. అంతేకాదు, నరేంద్ర మోదీకి దీటైన ప్రధాని అభ్యర్థిని నిలపడంపైనా చర్చలు సాగినట్టు తెలిపాయి. కాగా, మోదీకి వ్యతిరేకంగా ప్రధాని అభ్యర్థి రేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరు వినిపిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు, మమత, మొదట కొవిడ్ పై పోరాడాల్సి ఉందని, ఆ తర్వాతే 2024 ఎన్నికలని తమ తక్షణ ప్రాధాన్యత దేనికో చెప్పారు.

  • Loading...

More Telugu News