Amazon: బెజోస్ అంతరిక్షంలోకి వెళితే అక్కడే ఉండాలి.. తిరిగి భూమిపైకి రానివ్వొద్దంటూ వేలాదిమంది సంతకాలు

Tens Of Thousands Sign Petition To Stop Jeff Bezos From Returning To Earth
  • వచ్చే నెల 20న సోదరుడితో కలిసి బెజోస్ అంతరిక్ష యాత్ర
  • ‘బిలియనీర్లు ఉండకూడదు’ అనే అంశాన్ని ప్రస్తావించిన ఆన్‌లైన్ పిటిషన్
  • నిన్నటి వరకు 33 వేలమంది సంతకాలు
దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వచ్చే నెల 20న తన సోదరుడు మార్క్ బెజోస్ తో కలిసి అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. సొంత సంస్థ అయిన ‘బ్లూ ఆరిజన్’ అభివృద్ధి చేసిన సొంత వ్యోమనౌక ‘న్యూ షెపర్డ్’ ద్వారా బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అయితే, ఈ యాత్రపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెజోస్ కనుక అంతరిక్షంలోకి వెళ్తే తిరిగి భూమ్మీదకు రావడానికి వీల్లేదంటూ ఓ వింత పిటిషన్ ఆన్‌లైన్‌కెక్కింది. దీనిపై నిన్నటి వరకు 33 వేల మందికిపైగా సంతకాలు చేశారు. బెజోస్ అంతరిక్ష యాత్రకు సంబంధించి అనేక పిటిషన్‌లు ఉన్నప్పటికీ ఆయన మళ్లీ భూమిపైకి రాకూడదన్న పిటిషన్‌పైనే ఎక్కువమంది సంతకాలు చేశారు. ‘బిలియనీర్లు ఉండకూడదు’ అనే అంశాన్ని ఈ పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.
Amazon
Jeff Bezos
Blue Origin
New Shepard
space

More Telugu News