Sharmila: ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన.. సంఘాలకు మద్దతుగా మేము నిలబడుతాం: ష‌ర్మిల‌

sharmila slams kcr

  • అణిచివేత ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది
  • ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
  • ప్రశ్నించే వారు ఎవరూ ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేశావ్
  • పోరాటం ద్వారానే తిరిగి మా సమస్యలు పరిష్కారమ‌వుతాయి

తెలంగాణ‌లో ఆర్టీసీ యూనియన్లు మరోసారి ఉద్యమబాట పట్టాయంటూ ఓ దిన‌ప‌త్రికలో వ‌చ్చిన వార్త‌ను వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ‌ డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారానికి యూనియ‌న్లు అన్నీ ఏకమయ్యాయ‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. 10 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయని, యూనియన్ల నేతలు నిన్న‌ అధికారికంగా జేఏసీని ప్రకటించారని అందులో చెప్పారు.

ఆర్టీసీలో యూనియన్లకు స్థానం లేదని 2019 సమ్మె తర్వాత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పినప్పటి నుంచి యూనియన్లు స్తబ్దుగా ఉన్నాయని, యూనియన్ల స్థానంలో వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీలు తీసుకొచ్చినా అవి అడ్ర‌స్సు లేకుండా పోయాయని అందులో చెప్పారు. దీంతో 49 వేల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, 15వ తేదీ దాటినా జీతాలు రావట్లేదని తెలిపారు. అంతేగాక‌, రెండు పీఆర్సీలు, నాలుగు డీఏలు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాల‌ను ష‌ర్మిల ప్ర‌స్తావించారు.

'అణిచివేత ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రశ్నించే వారు ఎవరు ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేశావ్ ..  పోరాటం ద్వారానే తిరిగి మా సమస్యలు పరిష్కారమౌతాయని ఒక్కటైన ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన .. సంఘాలకు మద్దతుగా మేము నిలబడుతాం' అని ష‌ర్మిల హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News