YS Vivekananda Reddy: వివేక హత్య కేసులో కొనసాగుతోన్న సీబీఐ విచారణ
- కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారణ
- వరుసగా 16వ రోజూ వివరాలను రాబట్టేందుకు యత్నిస్తోన్న అధికారులు
- పులివెందులకు చెందిన అనుమానితులను ప్రశ్నించే అవకాశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో కొన్ని రోజులుగా సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా 16వ రోజు ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు పలువురిని విచారిస్తున్నారు.
పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా నిన్న కూడా సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో వైఎస్ వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని ఏడుగంటల పాటు విచారించారు. అలాగే కడపకు చెందిన రవిశంకర్, పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులు, వారి కుమారులు కిరణ్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్‌లను ప్రశ్నించారు.