WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్: ఎట్టకేలకు ఆట ప్రారంభం... రాస్ టేలర్ అవుట్
- సౌతాంప్టన్ లో నిలిచిన వర్షం
- ఆలస్యంగా మొదలైన ఐదో రోజు ఆట
- టేలర్ ను అవుట్ చేసిన షమీ
- మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
సౌతాంప్టన్ లో వరుణుడు శాంతించాడు! భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఐదో రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట ఆరంభంలోనే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బ్రేక్ ఇచ్చాడు. న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ (11) ను అవుట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.
ప్రస్తుతం కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 128 పరుగులు చేయగా... కెప్టెన్ కేన్ విలియమ్సన్ 15 పరుగులతోనూ, హెన్రీ నికోల్స్ 6 పరుగులతోనూ ఆడుతున్నారు. ఆ జట్టు భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు రేపు ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలుండడంతో ఫలితంపై ఎవరికీ పెద్దగా ఆశలు కలగడంలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.