CBI-ED Court: జగన్ ఆస్తుల కేసు... సీబీఐ-ఈడీ కోర్టులో విచారణ వచ్చే నెల 2కి వాయిదా

CBI and ED Court adjourns hearing of Jagan assets case

  • జగన్ ఆస్తుల వ్యవహారంపై కోర్టులో విచారణ
  • తన న్యాయవాదిని అనుమతించాలన్న సీఎం జగన్
  • అభియోగాల నమోదు వాయిదా వేయాలన్న విజయసాయి
  • వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం

సీఎం జగన్ ఆస్తుల వ్యవహారంలో నేడు సీబీఐ-ఈడీ కోర్టు విచారణ చేపట్టింది. తన బదులు తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు. ఈడీ కేసులను ముందుగా విచారణ జరపాలన్న సీబీఐ-ఈడీ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు వివరించారు.

అయితే హైకోర్టు జడ్జి సెలవులో ఉన్నారని, దాంతో పిటిషన్లు ఇంతవరకు విచారణకు రాలేదని సీబీఐ-ఈడీ కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో, ఈడీ కేసుల విచారణకు సంబంధించిన అభియోగాల నమోదును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో, కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది. అటు, ఈ కేసులో జగన్ తరఫు వాదనలు కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News