WTC Final: ముగిసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్.. కివీస్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యం
- 170 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
- ప్రత్యర్థి ముందు స్వల్ప విజయ లక్ష్యం
- భారత్‌ను దెబ్బకొట్టిన సౌథీ
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 170 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా ప్రత్యర్థి కివీస్ ఎదుట 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టిమ్ సౌథీ దెబ్బకు వరుస పెట్టి వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సౌథీ, బౌల్ట్, జెమెసన్ బౌలింగ్ దాడికి తట్టుకోలేని భారత బ్యాట్స్‌మెన్ చివరి 4 వికెట్లను 14 పరుగుల తేడాతో చేజార్చుకున్నారు.
భారత ఆటగాళ్లలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన 41 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. రోహిత్ శర్మ 30 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. కివీస్ బౌలర్లలో సౌథీ నాలుగు, బౌల్ట్ మూడు వికెట్లు తీసుకోగా, జెమీసన్ రెండు, నీల్ వాగ్నర్ ఒక వికెట్ పడగొట్టారు.