Jharkhand: థర్డ్ వేవ్ ప్రమాదం ఉంది.. లాక్ డౌన్ పొడిగిస్తున్నాం: ఝార్ఖండ్ సీఎం

Lockdown extended in Jharkhand
  • ఝార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు
  • ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడలేదన్న హేమంత్ సొరేన్
  • అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు నో పర్మిషన్
కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కు సంబంధించి కఠిన నిబంధనలను ప్రారంభించింది. లాక్ డౌన్ విధించింది. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు లాక్ డౌన్ ను పొడిగించింది. తాజా లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించబోమని ఝార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సంబంధించి ఈ-పాస్ ఉండాలని సూచించింది. అధికారుల వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది. ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉంచాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భేటీ అయింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా హేమంత్ సొరేన్ మాట్లాడుతూ, ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తున్నామని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇంకా బయటపడలేదని... కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని అన్నారు.  
Jharkhand
Lockdown
Hemant Soren

More Telugu News