Raghu Rama Krishna Raju: ఇది ప్రజా విజయం: ఏపీలో పరీక్షల రద్దుపై రఘురామకృష్ణరాజు స్పందన

Raghurama Krishnaraju responds after AP Govt announced exams cancellation

  • ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
  • సర్కారు నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి ఆదిమూలపు
  • సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకుందన్న రఘురామ
  • ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకుందని వ్యాఖ్య  

సుప్రీంకోర్టు జోక్యం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిందని, ఇది ప్రజా విజయం అని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో సకాలంలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రఘురామ వివరించారు.

అటు, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పరీక్షల రద్దు నిర్ణయంపై ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చిందని, రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించారని, తెలుగుదేశం పార్టీ కోర్టును ఆశ్రయించడం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ కలిసి గట్టిగా పోరాడడం వల్ల ప్రభుత్వం మనసు మార్చుకుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News