Raghu Rama Krishna Raju: ఈ పన్నుల భారం నుంచి ఏపీ ప్రజలను కాపాడాలి: ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

raghu rama writes letter to jagan

  • జ‌గ‌న్‌కు రఘురామ కృష్ణరాజు మ‌రో లేఖ
  • ఉచిత పథకాలతో ఏపీ ప్రభుత్వానికి నిధుల కొరత
  • నిధుల కోసం ప‌న్నుల వ‌సూళ్లు
  • చెత్తపై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు మ‌రో లేఖ రాశారు.  నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆయ‌న లేఖ‌లు రాయ‌డం మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఏపీలో అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాల గురించి ఆయ‌న ఈ రోజు రాసిన లేఖలో ప్ర‌స్తావించారు. ఉచిత పథకాలతో ఏపీ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడుతోందని తెలిపారు.

 నిధుల కోసం చెత్తపై పన్ను సహా ఇతర ప‌న్నుల వ‌సూళ్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ తీరు స‌రికాద‌ని చెప్పారు. చెత్తపై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని తెలిపారు. అలాగే, రవాణా శాఖ ప్రజలపై భారం మోపి రూ.400 కోట్లు సంపాదిస్తోంద‌ని చెప్పారు. వాహనాల జీవిత పన్నును 3 శాతం పెంచారని విమ‌ర్శించారు. అలాగే, రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు పెంచుతున్నారని, గ్రీన్‌ ట్యాక్స్‌ పేరిట జరిమానా వసూలు చేయబోతున్నారని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏపీలో ఈ పన్నుల భారం నుంచి ప్రజలను కాపాడాల‌ని జగన్‌ను కోరారు.

  • Loading...

More Telugu News