DRDO: పినాక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో

DRDO successfully test fires Pinaka rockets
  • షార్ట్ రేంజ్ రాకెట్ పరీక్షలు చేపట్టిన డీఆర్డీవో
  • ఒడిశాలోని చాందీపూర్ తీరంలో పరీక్షలు
  • 25 రాకెట్ల పరిశీలన
  • అభివృద్ధి పరిచిన రాకెట్లతో లక్ష్యఛేదన
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇవాళ పినాక రాకెట్లను విజయవంతంగా పరీక్షించింది. సామర్థ్యం పెంచిన ఈ పినాక రాకెట్లను ఓ లాంచర్ నుంచి ప్రయోగించగా, అవి ఆశించిన ఫలితాలను ఇచ్చాయి. డీఆర్డీవో వర్గాలు రెండ్రోజుల నుంచి ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి పినాక రాకెట్ పరీక్షలు చేపట్టాయి.

వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను ఛేదించేందుకు 25 రాకెట్లను పరీక్షించారు. పినాక రాకెట్ 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతగా ఛేదించింది. సైన్యం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పినాక రాకెట్ లో డీఆర్డీవో పలు మార్పులు చేసింది. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థల సాయంతో ఈ రాకెట్ల గమనాన్ని డీఆర్డీవో నిశితంగా పరిశీలించింది.
DRDO
Pinaka
Rocket
Army
India

More Telugu News