Mangoes: పాకిస్థాన్ లో భలే మామిడిపండ్లు... షుగర్ బాధితులు కూడా తినొచ్చట!

Sugar free mangoes in Pakistan

  • ప్రత్యేక మామిడి రకాలు సాగుచేస్తున్న సింధ్ రైతు
  • విదేశీ మామిడి రకాలకు శాస్త్రీయ మార్పులు
  • సోనారో, గ్లెన్, కీట్ రకాలుగా నామకరణం
  • కిలో ధర రూ.150

ఫలరాజు మామిడి అంటే ఎవరికైనా నోరూరాల్సిందే. అయితే, మధుమేహ బాధితులు మాత్రం ఇష్టంవచ్చినట్టు మామిడిపండ్లు తినలేక ఉసూరుమంటుంటారు. మామిడిపండ్లలో చక్కెర శాతం అధికంగా ఉండడమే అందుకు కారణం. అయితే, పాకిస్థాన్ లో ఓ రైతు చక్కెర శాతం అతి తక్కువగా ఉండే ప్రత్యేకమైన మామిడి రకాలను సాగు చేస్తున్నారు. వీటిని సోనారో, కీట్, గ్లెన్ అని పిలుస్తారు. కీట్ రకంలో చక్కెరశాతం 4.7, సోనారో రకంలో 5.6 శాతం, గ్లెన్ రకంలో 6 శాతం ఉంటుందట. ఇవి కిలో రూ.150 ధర పలుకుతున్నాయి.

పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతంలో ఓ ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో శాస్త్రీయ మార్పులు చేసిన ఈ మామిడి రకాలను సాగు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మామిడి రకాలను శాస్త్రీయ ప్రక్రియలతో షుగర్ బాధితులు కూడా తినేలా మార్పు చేసినట్టు రైతు గులాం సర్వర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News