KCR: ఆన్ లైన్ లోనే పాఠశాల తరగతులు: సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR orders for online classes for schools

  • జులై 1 నుంచి తెలంగాణ విద్యాసంస్థల ప్రారంభం
  • ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదన్న కేసీఆర్
  • ఆన్ లైన్ బోధన ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశం
  • మంత్రి సబితకు దిశానిర్దేశం

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి ఆన్ లైన్ లోనే పాఠశాల తరగతులు నిర్వహించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ఇప్పట్లో ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని సీఎం పేర్కొన్నారు. వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని నిర్దేశించారు.

ఇటీవలే తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం తెలిసిందే. ఆ సమయంలో, తెలంగాణ ప్రభుత్వం జులై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతిచ్చింది. కానీ స్కూళ్లలో ప్రత్యక్ష బోధన సాగుతుందా? ఆన్ లైన్ బోధనా? అనేది స్పష్టత ఇవ్వలేదు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆన్ లైన్ బోధనే అనేది స్పష్టమైంది.

  • Loading...

More Telugu News