Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ పై విద్యార్థి సంఘాల జేఏసీ అసంతృప్తి

AP Students JAC slams govt on job calendar

  • ఈ నెల 18న జాబ్ క్యాలెండర్ విడుదల
  • 36 ఉద్యోగాలే చూపించారన్న జేఏసీ
  • కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్
  • ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నియామకాల క్యాలెండర్ పై రాష్ట్ర విద్యార్థి సంఘాల జేఏసీ అంసతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ సర్కారు విడుదల చేసింది జాబ్ క్యాలెండరా? లేక, జాబ్ లెస్ క్యాలెండరా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఈ నెల 18న విడుదల చేసిన క్యాలెండర్ లో 36 ఉద్యోగాలను మాత్రమే చూపించారని ఆరోపించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి ప్రకటించారని జేఏసీ నేతలు వెల్లడించారు.

ఈ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 28న ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉచిత పథకాలతో కాలయాపన చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News