Corona Virus: కరోనా థర్డ్ వేవ్ రాదు.. వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదు: ఐసీఎంఆర్
- ఎందరో ప్రాణాలను బలిగొన్న సెకండ్ వేవ్
- వైద్య నిపుణులతో కలిసి అధ్యయనం నిర్వహించిన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్
- థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేనని అధ్యయనంలో వెల్లడి
కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ దెబ్బకు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. మరోవైపు థర్డ్ వేవ్ కూడా రాబోతోందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని తెలిపింది. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని చెప్పింది.
ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇతర వైద్య నిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేననే విషయం ఈ అధ్యయనంలో తేలింది.