Delta Variant: టీకాలు తీసుకోనివారిలో శరవేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ

Delta Variant most Dangerous Than Alpha Variant

  • 85 దేశాల్లో డెల్టా వేరియంట్
  • వైరస్ మరింతగా రూపాంతరం చెందే అవకాశం
  • వైరస్ ఏదైనా వ్యాప్తిని, తీవ్రతను తగ్గించడంలో టీకాలు పనిచేస్తాయి: డాక్టర్ మరియా వాన్

టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్‌లో ఎన్నో రకాలు పుట్టినప్పటికీ వాటన్నింటికంటే డెల్టా వేరియంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని ఆ సంస్థ చీఫ్ టెడ్రస్ అధనోమ్ తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన అన్ని వేరియంట్ల కంటే ఇదే అత్యంత వేగంగా వ్యాప్తిస్తోందని పేర్కొన్నారు. దాదాపు 85 దేశాల్లో ఈ వేరియంట్ బయటపడిందన్నారు. కరోనా టీకాలు వేసుకోని వారిలో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. కరోనా  వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చాలా దేశాలు ఇటీవల కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. దీంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ మరింతగా రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ద్వారా కొత్త వేరియంట్లు రాకుండా నిరోధించవచ్చన్నారు.

ఆల్ఫా వేరియంట్ తర్వాత డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ కొవిడ్ టెక్నికల్ హెడ్ డాక్టర్ మరియా వాన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి దీని నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. వేరియంట్ ఏదైనా దాని వ్యాప్తిని, తీవ్రతను తగ్గించడంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని మరియా వివరించారు.

  • Loading...

More Telugu News