Chandira Priyanga: పుదుచ్చేరి మంత్రివర్గంలో 40 ఏళ్ల తర్వాత ఓ మహిళకు చోటు

First woman in Puducherry cabinet after four decades

  • ఇటీవల పుదుచ్చేరికి ఎన్నికలు
  • ఎన్నార్ కాంగ్రెస్, ఎన్డీయే కూటమి విజయం
  • గత నెల 7న సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం
  • 50 రోజుల తర్వాత మంత్రివర్గం ఏర్పాటు

ఇటీవల పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఎన్నార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి విజయం సాధించింది. సీఎంగా ఎన్నార్ రంగస్వామి గత నెల 7న ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాలతో మంత్రివర్గం ఏర్పాటు ఆలస్యమైంది. తాజాగా, ఐదుగురితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. పుదుచ్చేరి మంత్రివర్గంలో ఓ మహిళకు స్థానం దక్కడం 40 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. ఎన్నార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్ర ప్రియాంక ఈ అవకాశం దక్కించుకున్నారు.

కాగా, నేడు ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సమక్షంలో జరగనుంది. ఎన్నికల్లో ఎన్నార్సీ, ఎన్డీయే కూటమి విజయం సాధించిన 50 రోజుల అనంతరం క్యాబినెట్ ఏర్పాటైంది.

  • Loading...

More Telugu News