Intermediate: రేపు తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడి

Telangana Inter second year results will be out tomorrow

  • తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్
  • ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు
  • మార్కుల వెల్లడికి విధివిధానాలు ఖరారు
  • రేపు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఏ విధంగా ఇవ్వాలన్నదానిపై ఇటీవల విధివిధానాలు రూపొందించారు. ఈ మేరకు రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఫస్టియర్ లో సంబంధిత సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో, సెకండియర్ లోనూ ఆ సబ్జెక్టులకు అన్నే మార్కులు ఇవ్వనున్నారు. ప్రాక్టికల్స్ కు మాత్రం ఫుల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు పాస్ మార్కులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు ఫలితాలతో సంతృప్తి చెందకపోతే, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News