AIIMS: న్యూఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం!

Fire Accident in Delhi AIIMS

  • స్టోర్ రూములో అగ్నిప్రమాదం
  • మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
  • ఎవరూ గాయపడలేదన్న అధికారులు

న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) స్టోర్ రూములో ఈ ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్టు ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News