Shikhar Dhawan: శ్రీలంక పర్యటనకు బయల్దేరిన ధావన్ నాయకత్వంలోని టీమిండియా
- ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న కోహ్లీ సేన
- అదే సమయంలో శ్రీలంక పర్యటన
- ధావన్ కెప్టెన్ గా టీమిండియా ఎంపిక
- జులై 13 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ లో పర్యటిస్తుండగా, అదే సమయంలో శ్రీలంక పర్యటన రావడంతో శిఖర్ ధావన్ నేతృత్వంలో మరో జట్టును ఎంపిక చేయడం తెలిసిందే. ధావన్ నేతృత్వంలోని టీమిండియా నేడు శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లింది. ఈ జట్టుకు రాహల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు.
ఈ పర్యటనలో భారత జట్టు పరిమితి ఓవర్ల క్రికెట్ సిరీస్ లు ఆడనుంది. జులై 13 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు శ్రీలంకతో 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్ వంటి ప్రతిభావంతులతో కూడిన టీమిండియాను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాలే అని చెప్పవచ్చు.
శ్రీలంక పర్యటనలో పాల్గొనే టీమిండియా సభ్యుల వివరాలు
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.
కాగా, ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయికిశోర్, సిమర్జీత్ సింగ్ నెట్ బౌలర్లుగా భారత జట్టుకు ఈ పర్యటనలో సహకరిస్తారు.