Mahesh Babu: అద్భుతం చేశారు దీపికా కుమారీ... భారత ఆర్చరీ తారకు మహేశ్ బాబు అభినందనలు

Mahesh Babu appreciates Indian gold medalist archer Deepika Kumari
  • పారిస్ లో వరల్డ్ కప్ ఆర్చరీ
  • రికర్వ్ విభాగంలో సత్తా చాటిన దీపిక
  • టీమ్, మిక్స్ డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు
  • మరింతగా దూసుకెళ్లాలన్న మహేశ్ బాబు
పారిస్ లో జరుగుతున్న వరల్డ్ కప్ స్టేజ్-3 ఆర్చరీ ఈవెంట్ లో భారత విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి అసమాన ప్రతిభ చూపడంతో భారత జట్టు పసిడి మోత మోగించింది. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. దీపికా కుమారి, ఆమె బృందానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. వరల్డ్ కప్ ఆర్చరీ వేదికపై నిజంగా ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన, అద్భుతమైన విజయం అని కొనియాడారు. ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని మహేశ్ బాబు ఆకాంక్షించారు.

దీపికా కుమారి రికర్వ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో, రికర్వ్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాలు సాధించి భారత కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. ఒలింపిక్స్ కు ముందు భారత ఆర్చరీ రంగంలో కొత్త ఆశలు కలిగించింది. వరల్డ్ కప్ ఆర్చరీలో మూడు స్వర్ణ పతకాలు గెలుచుకోవడం ద్వారా దీపికా కుమారి ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది.
Mahesh Babu
Deepika Kumari
Archary
World Cup
Paris

More Telugu News