Indian Railways: లాక్‌డౌన్ కారణంగా రద్దు చేసిన పది రైళ్లు మళ్లీ పట్టాలపైకి

Inidian Railway Resume 10  trains from july 1st

  • సికింద్రాబాద్, కాజీపేట, ఆదిలాబాద్, ముంబై నుంచి ప్రారంభం కానున్న రైళ్లు
  • మరో 8 రైళ్ల గడువు పొడిగింపు
  • రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు

కరోనా లాక్‌డౌన్ కారణంగా గతంలో రద్దు చేసిన పది రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. అలాగే, మరో 8 రైళ్ల గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొంది. పట్టాలెక్కనున్న రైళ్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, ఆదిలాబాద్ నుంచి నడిచే రైళ్లు ఉన్నాయి. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్-ఆదిలాబాద్ (01142) రైలు గురువారం పట్టాలెక్కనుండగా, ఆదిలాబాద్- ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ (01141) రైలు జులై 2 నుంచి సేవలు ప్రారంభించనుంది. పూణె-కాజీపేట (01251) రైలు జులై 9 నుంచి, కాజీపేట-పూణె (01252) రైలు 11వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.

సికింద్రాబాద్-రక్సౌల్ (07026), రక్సౌల్-సికింద్రాబాద్ (07025), హైదరాబాద్-గోరఖ్‌పూర్ (02575), గోరఖ్‌పూర్-హైదరాబాద్ (02576), షాలిమార్-సికింద్రాబాద్ (02449), సికింద్రాబాద్-షాలిమార్ (02450) రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. కాగా, హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను 12  నుంచి 57కు పెంచినందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News