South Africa: ఒక మహిళ ఇక ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు.. బహుభర్తృత్వంపై దక్షిణాఫ్రికాలో కీలక ప్రతిపాదన

South Africa considers letting women have multiple husbands

  • స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం ఇప్పటికే అమల్లో
  • ఇప్పుడు బహుభర్తృత్వంపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం రెడీ
  • పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి పనిచేయవంటున్న మత సంస్థలు

ప్రపంచంలోని అత్యంత ఉదారమైన రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు బహుభర్తృత్వం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉంది. తాజాగా బహుభర్తృత్వంపై వచ్చిన ప్రతిపాదనను స్వీకరించడం ద్వారా సంచలనం సృష్టించింది. మహిళలు పలువురిని పెళ్లాడేందుకు  చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలు కూడా రెడీ అయింది. బహుభర్తృత్వంపై ప్రజాభిప్రాయాలను స్వీకరించేందుకు ఆ గ్రీన్ పేపర్ జారీ చేసింది.

దక్షిణాఫ్రికాలో పురుషులు, మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న వారు ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేస్తుండగా, సంప్రదాయవాదులు, మత సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. బహుభర్తృత్వం ద్వారా పుట్టే పిల్లలకు తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని అక్కడి బుల్లితెర ప్రముఖ నటుడు మౌసా సెలేకూ ప్రశ్నించారు. ఆయన నలుగురు భార్యలకు భర్త. బహుభర్తృత్వం వల్ల దేశ సంస్కృతి నాశనం అవుతుందని అన్నారు. బహుభార్యత్వం ఆమోదం పొందిన ఆచారమని, కానీ బహుభర్తృత్వానికి ఆమోదం లేదని ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీ నేత కెన్నెత్ మెషో పేర్కొన్నారు. పురుషాధిక్య ప్రపంచంలో బహుభర్తృత్వం చెల్లదని అభిప్రాయపడ్డారు. ముస్లిం మత సంస్థలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.

  • Loading...

More Telugu News