rain: గతేడాదితో పోల్చితే.. హైదరాబాద్లో ఈ నెలలో తక్కువ వర్షపాతం
- 16 శాతం తక్కువ వర్షపాతం నమోదు
- ఇప్పటిరవకు 133.2 మి.మీ. వర్షపాతం
- తెలంగాణలో 56 శాతం వర్షపాతం
తెలంగాణలో ఈ నెల ప్రారంభం నుంచి వర్షాలు భారీగానే కురిసినప్పటికీ హైదరాబాద్ లో మాత్రం గత ఏడాదితో పోల్చితే 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు హైదరాబాద్లో 133.2 మి.మీ. వర్షపాతం నమోదయిందని వివరించారు. ఈ నెలలో రాష్ట్రంలో 56 శాతం వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. వచ్చే నెలలో వర్షాలు గత ఏడాది కంటే ఎక్కువ కురుస్తాయా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉందని చెప్పారు. నిన్న హైదరాబాద్లో 34.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న ఏడు రోజులు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశముంది.