Nara Lokesh: కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి: నారా లోకేశ్
- మంత్రులతో, అధికారులతో మాట్లాడాలి
- కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది
- నిరుద్యోగులను నిలువునా ముంచేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్ను వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
'అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి కాసేపు మంత్రులతో, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది వైఎస్ జగన్ గారు! నిరుద్యోగులను నిలువునా ముంచేసిన మీ జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి' అని నారా లోకేశ్ అన్నారు.
'పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు ఆత్మలతో కాకుండా మీ అంతరాత్మతో మాట్లాడి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను' అని నారా లోకేశ్ అన్నారు.