Jai Shankar: కొవిషీల్డ్ కు అనుమతిపై ఈయూ వద్ద ప్రస్తావించిన విదేశాంగ మంత్రి జైశంకర్

Union Minister Jai Shankar says he raised Covishiled issue at EU high rep Josep Borell Fontelles

  • ఈయూ దేశాల్లో గ్రీన్ పాస్
  • గ్రీన్ పాస్ జాబితాలో కేవలం 4 వ్యాక్సిన్లు
  • కొవిషీల్డ్ కు దక్కని చోటు
  • కొవిషీల్డ్ తీసుకున్నవారిని అనుమతించని ఈయూ

భారత్ లో తయారైన ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ 'కొవిషీల్డ్' తీసుకున్నప్పటికీ యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తుండడం పట్ల కేంద్రం స్పందించింది. తాను ఈ సమస్యను యూరోపియన్ యూనియన్ (ఈయూ) అత్యున్నత ప్రతినిధి జోసెప్ బోరెల్ ఫాంటెల్లెస్ కు వివరించానని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. మాటెరాలో జీ-20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో.... బోరెల్ తో చర్చిస్తూ కొవిషీల్డ్ కు గ్రీన్ పాస్ లో చోటు కల్పించడంపైనా చర్చించానని వివరించారు. దేశంలో కొవిషీల్డ్ ఉత్పత్తి, అనుమతుల అంశాన్ని  వివరించానని తెలిపారు.

యూరోపియన్ యూనియన్ గ్రీన్ పాస్ పేరిట కరోనా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ గ్రీన్ పాస్ లో మోడెర్నా, ఫైజర్, వాక్స్ జెవిరా (ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా), జాన్సెన్ (జాన్సన్ అండ్ జాన్సన్) వ్యాక్సిన్లకు మాత్రమే చోటు కల్పించారు. ఈ నాలుగు టీకాలు తీసుకున్నవారు మాత్రమే ఈయూ దేశాల్లో ప్రయాణించేందుకు అర్హులవుతారు.

అయితే, భారత్ లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని యూరప్ దేశాలకు వెళ్లినవారికి ఆంక్షలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది.

  • Loading...

More Telugu News